: మాటలతో మంటలు రేపిన బీజేపీ నేత గిరిరాజ్


బీహార్ కు చెందిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తన వ్యాఖ్యలతో అగ్గి రాజేశారు. మోడీని వ్యతిరేకించే వారు ఎన్నికల ఫలితాల అనంతరం పాకిస్థాన్ కు వెళ్లాల్సి ఉంటుందని, అటువంటి వారికి దేశంలో చోటు లేదని ఆయన వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది. నిన్న జార్ఖండ్ లోని గోడా జిల్లాలో జరిగిన సభలో గిరిరాజ్ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమర్శలు రావడంతో గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని తాము ఆమోదించేది లేదని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. తమ ప్రధాని అభ్యర్థి మోడీ సానుకూల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News