: గాడ్జెట్స్‌ అన్నీ స్టేటస్‌ కోసమేనట!


ఇప్పుడు నవతరం కుర్రకారు చేతిలో చూస్తే.. రకరకాల ట్యాబ్లెట్లు, ఆండ్రాయిడ్‌ బేస్‌డ్‌ గాడ్జెట్లు కనిపిస్తాయి. తమ ప్రపంచం మొత్తం అందులోనే నిక్షిప్తమై ఉన్నట్లుగా పగలూ రాత్రీ వాటి సాహచర్యంలోనే మనకు వారు కనిపిస్తూ ఉంటారు. ఈ గాడ్జెట్‌లతో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయంటూ కుర్రకారు ఇతరులకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. 

అయితే సామాజిక శాస్త్రవేత్తలు ఈ గాడ్జెట్‌ ల పిచ్చి కేవలం ఒక హోదా కోసమే అని విశ్లేషిస్తున్నారు. తాము ఏ వాహనం కలిగి ఉన్నాం, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం.. అనే దాన్ని బట్టి తమ సామాజిక హోదా ప్రదర్శించుకోవాలని అభిలషించే... బాపతు వారే ఈ గాడ్జెట్ల మోజులోనూ ఉంటారని అంటున్నారు. ఐఫోన్లు, ట్యాబ్లెట్లు ఇలాంటివన్నీ ఆ కోవకే చెందుతాయట. బెర్కిలీ స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ లో సోషియాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కోయే చెషిరే ఈ విషయాల్ని వెల్లడించారు. 

కాకపోతే, చెషిరే చేసిన పరిశోధనలో 16 వేల మందితో మాట్లాడితే అందులో 32 శాతం మంది అపిల్‌ ఉత్పత్తులనే వాడుతున్నారట. 

  • Loading...

More Telugu News