: పంచభూతాలను దోపిడీ చేసిన కాంగ్రెస్: ప్రకాశ్ జవదేకర్


కాంగ్రెస్ పార్టీ పంచభూతాలను దోపిడీ చేసిందని బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవవేకర్ మండిపడ్డారు. అందుకే ప్రజలు బలీయమైన మార్పును కోరుకుంటున్నారని ఆయన ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎన్డీయే ఈసారి దేశవ్యాప్తంగా 300కుపైగా లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని, దక్షిణాదిలో మెరుగైన ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ-బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందన్నారు.

  • Loading...

More Telugu News