: మెదక్ చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు


భక్తుల గీతాలు, గురువుల దీవెనల నడుమ యేసుక్రీస్తు పునరుత్థాన (ఈస్టర్) పండుగను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో తెల్లవారుజామున 4.30 గంటలకు సూర్యోదయ ఆరాధనతో మొదటి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శిలువను ఊరేగించారు. సూర్యోదయ ఆరాధనకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెల్లవారు జాము నుంచి 8 గంటల వరకు మొదటి ఆరాధన కొనసాగింది. ఈ సందర్భంగా భక్త బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఉదయం 10 గంటలకు రెండవ ఆరాధన కార్యక్రమం జరిగింది. ప్రార్థనల అనంతరం శిలువను చర్చి లోపలి వరకు ఊరేగించారు. ప్రెసిబిటరీ ఇంఛార్జి రెవరెండ్ రాబిన్ సన్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు.

  • Loading...

More Telugu News