: బైక్ రేసులు నిర్వహిస్తున్న 15 మంది యువకుల అరెస్ట్
తిన్నది అరగకపోతే ఊరంతా తిరిగొచ్చాడన్నట్లు... హైదరాబాద్ లో ప్రముఖుల పుత్రులకు వారాంతం వచ్చిదంటే పూనకం వచ్చేస్తుంది. మద్యం సేవించడం, బైకు రేసులతో పోటీ పడడం వారికో అలవాటుగా మారిపోయింది. నిన్న అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రేసులతో నానా రచ్చ చేస్తున్న 15 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఖరీదైన 8 బైకులను, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారు ప్రముఖుల పిల్లలు అని తేలడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, జులాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.