: ప్రధాని కార్యాలయమే అవినీతికి చిరునామా: మోడీ


సాక్షాత్తూ దేశ ప్రధాని కార్యాలయమే అవినీతికి చిరునామాగా మారిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన వారే పుస్తక రూపంలో వెల్లడించారని చెప్పారు. యూపీఏ పాలన కుంభకోణాలమయమని, ఈ పరిస్థితులలో దేశాన్ని ఎవరు రక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు ఇటీవలే పుస్తక రూపంలో యూపీఏ పాలనా రహస్యాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఛత్తీస్ గఢ్ లోని బిశ్రంపూర్ లో ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొని మాట్లాడారు.

  • Loading...

More Telugu News