: కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిని నిర్బంధించిన కార్యకర్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా టీడీపీ టికెట్ ను ఆశించి భంగపడ్డ లింగారెడ్డిని సముదాయించేందుకు వచ్చిన, పార్టీ కడప అభ్యర్థి శ్రీనివాసరెడ్డిని కార్యకర్తలు ఇంట్లో నిర్బంధించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన లింగారెడ్డికి పార్టీ తరపున న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వాలని ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డిని కోరారు. అప్పటి వరకు వదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.