: కాల్షియం మాత్రలతో మహిళల్లో హృద్రోగాలు రెట్టింపు


బలంగా ఉండడం కోసం కాల్షియం సప్లిమెంట్‌లు/ మాత్రలను డాక్టర్లు చాలా అలవాటుగా సూచిస్తుంటారు. నిజానికి డాక్టర్ల సలహాలు లేకపోయినా కూడా.. బలంకోసం తమకు తాముగా కాల్షియం మాత్రలు తీసుకునే వారు మనలో ఎక్కువగానే ఉంటారు. అలాంటి వారికి హెచ్చరిక ఈ వార్త. 

తాజాగా అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వారి తాజా సంచికలో అధికంగా కాల్షియం మాత్రలు తీసుకోవడం వలన హృద్రోగాలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నారు. గుండె పోటులాగానే ఎముకల సంబంధిత సమస్యలు కూడా అధికంగా ఉండే ఆ దేశంలో.. ఈ హెచ్చరికను వైద్యులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. 

పూర్తిగా కాల్షియం మాత్రలు మానక్కర్లేదని, కానీ మితం పాటించడం అవసరం అని చెబుతున్నారు. కాల్షియంను అధికంగా సూచించే భారతీయ డాక్టర్లు ఇప్పుడు పునరాలోచించాలని డాక్టర్‌ రమాకాంత్‌ పాండా సూచిస్తున్నారు. బోన్‌స్కానింగ్‌ లేదా, విటమిన్‌ లోపంలో కాల్షియం అవసరం కచ్చితంగా కనిపిస్తే తప్ప సూచించకూడదని వారు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News