: నేడు నల్గొండ జిల్లాలో చంద్రబాబు ప్రచారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ లో దిండి చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి 10.50 గంటలకు దేవరకొండ చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 12.50 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా సభలో, 2.50 గంటలకు మిర్యాలగూడ సభలో, సాయంత్రం 4.10 గంటలకు హుజూర్ నగర్ సభలో, 5.40 గంటలకు కోదాడ సభలో ప్రసంగిస్తారు. ఇక రాత్రి 7.10 గంటలకు సూర్యాపేట మండలం వి.మాదారం గ్రామంలో జరిగే ప్రచార సభలో పాల్గొన్న అనంతరం రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేష్ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.