: తాత కాబోతున్న బిల్ క్లింటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తాత కాబోతున్నాడు. క్లింటన్ కుమార్తె చెల్సియా భర్త మార్క్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ విషయం వెల్లడించింది. చెల్సియా ప్రస్తుతం బిల్ క్లింటన్ ఫౌండేషన్ లో మహిళా సాధికారతకు సంబంధించిన ప్రాజెక్టులో పని చేస్తోంది. తన బిడ్డ ఆడైనా, మగైనా శక్తిమంతమైన మహిళల మధ్య ఎదుగుతుందని చెప్పగలనని చెల్సియా అభిప్రాయపడింది.