: బెంగళూరు విజయ లక్ష్యం 116


ఐపీఎల్ 7లో భాగంగా ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతున్న పోరులో ముంబై జట్టు 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై బ్యాట్స్ మన్ ను బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కట్టడి చేశారు. దీంతో 115 పరుగులకు ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ముంబై బ్యాట్స్ మన్ లో అంబటి తిరుపతి రాయుడు మాత్రమే 35 పరుగులు సాధించి ఫర్వాలేదనిపించగా, ఆండర్ సన్ (18), తారే (17), హస్సీ 16 పరుగులతో ఓ మోస్తరుగా ఆడారు. బెంగళూరు బౌలర్లలో స్టార్క్, ఆరోన్, చాహల్ రెండేసి వికెట్లు తీసి రాణించారు. 116 పరుగుల విజయ లక్ష్యంతో బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభించింది.

  • Loading...

More Telugu News