: కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలకు చేదు అనుభవం
భద్రాచలంలో కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. పదేళ్లు అధికారంలో ఉండి గ్రామానికి ఏం ఉపకారం చేశారంటూ కేంద్ర మంత్రిని, ఎమ్మెల్యేను ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం చింతరేగుపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి, కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యే అభ్యర్థి కుంజా సత్యవతిని చింతరేగుపల్లి పొలిమేరల్లో అడ్డుకుని, గ్రామంలోకి రానివ్వకుండా తిప్పి పంపేశారు.