: టీఆర్ఎస్ సగటు రాజకీయ పార్టీ: కిషన్ రెడ్డి


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వెనకేసుకొచ్చారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని, సగటు రాజకీయ పార్టీ అని అన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. కష్టమైనా, నష్టమైనా బీజేపీ వెనకడుగు వేయలేదన్నారు. కానీ, జైరాం రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఇక ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదని కాంగ్రెస్ ను కిషన్ ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News