: మన అమ్ములపొదిలో సరికొత్త యుద్ధవిమానం


హిందూస్తాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ సంస్థ అభివృద్ధి చేసిన సరికొత్త తేలికపాటి యుద్ధవిమానం భారతీయ సేనల అమ్ముల పొదిలో చేరనుంది. తేలికపాటి యుద్ధవిమానంగా సేవలు అందించగల ఎల్‌సీఏ తేజస్‌ను తాజాగా సఫలవంతంగా ప్రయోగించి చూశారు. హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలోనే తొలిసారిగా.. ఈ విమానాన్ని ప్రాథమికంగా ప్రయోగించి చూశారు. ప్రమాణాల మేరకు దాని పనితీరు సవ్యంగా ఉన్నట్లు  నిర్ణయించారు. యుద్ద విమానం పనితీరులో ఎలాంటి లోపాలు కనిపించలేదని హెచ్‌ఏఎల్‌ అధ్యక్షుడు త్యాగి చెప్పారు. 

  • Loading...

More Telugu News