: మాజీ ఎమ్మెల్యే ముకుందా రెడ్డి కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీట్ల ముకుందారెడ్డి కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆయన గత వారం రోజులుగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1970లో సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన ఆయన 1983 నుంచి వరుసగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.