: సింగనమల టీడీపీ అభ్యర్థిగా పామిడి యామిని
సింగనమల టీడీపీ అభ్యర్థిపై సస్పెన్స్ వీడింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. సింగనమల అభ్యర్థిగా పామిడి యామినిని ఖరారు చేస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెకు బీఫారం కూడా అందజేసింది. దీంతో కాసేపట్లో ఆమె నామినేషన్ దాఖలు చేయన్నారు. శైలజానాథ్ టీడీపీలో చేరడం లేదని నిర్ధారణ అయింది.