: ఎన్నిలయ్యే వరకూ కొత్త సైన్యాధిపతి నియామకం వద్దు: బీజేపీ
కొత్త సైన్యాధిపతి నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ విషయంలో అంత తొందరెందుకని ప్రశ్నించింది. ఎన్నికలు ముగిసే వరకు నియామక ప్రక్రియను చేపట్టవద్దని కోరింది. ప్రస్తుతమున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రంసింగ్ పదవీ కాలం జూలై 31తో ముగిసిపోతోంది. ఉప సైన్యాధిపతిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ తదుపరి సైన్యాధిపతిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఎన్నికలయ్యే వరకు దీన్ని నిలిపివేయాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కోరారు.