: ఇక టీడీపీ ఎందుకు, కాంగ్రెస్ దేశంగా మార్చుకోండి: గిరిబాబు


ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని చంద్రబాబు నాయుడు నాశనం చేశాడని సినీ నటుడు గిరిబాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే చంద్రబాబునాయుడుకి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలే అన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలంతా కాంగ్రెస్ వారేనని, ఇక టీడీపీ ఎక్కడుందని నిలదీశారు. అందుకే టీడీపీకి ఆ పేరు సరిపోలేదని, పార్టీ పేరు కాంగ్రెస్ దేశంగా మారిస్తే చంద్రబాబుకు కలిసి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ తరపున గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని గిరిబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News