: ఎన్నికల అధికారికి పొన్నాల ఫిర్యాదు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారని, వారిని నిలువరించాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉపయోగిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.