: ఒకటోస్సారి.. హెచ్1 బీ వీసాలకు లాటరీలు
అమెరికాలో హెచ్1 బీ వర్క్ వీసాలను పొందడానికి అర్హులైన అభ్యర్థులను ఈ దఫా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. సాధారణంగా ఈ వీసాల కోసం వేల దరఖాస్తులు వస్తుంటాయి. సోమవారం నుంచి వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులను ఎంపిక చేయడానికి మాత్రం లాటరీ పద్ధతి పాటించనున్నట్లు అధికార్లు ప్రకటించారు. 2008 తర్వాత ఈ ఎంపికకు లాటరీని ఆశ్రయించడం ఇదే మొదటి సారి.
ఈ ఏడాది సెప్టెంబరు ఆఖరు వరకు ఉండే అమెరికా ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేవలం 65వేల హెచ్1 బీ వీసాలను మాత్రమే వారు ఇవ్వవచ్చు. అమెరికాలో ఉన్నత విద్య చదివిన వారికి మరో 20వేల వీసాలు అదనంగా ఇవ్వవచ్చు. అయితే వీటి కేటాయింపునకు లాటరీ విధానం అనేదే ఈ దఫా అభ్యర్థులకు కొత్త భయాలను కలిగిస్తోంది.