: సికింద్రాబాద్ లో ప్రచారం చేయాలని పవన్ ను కోరాం: దత్తాత్రేయ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సికింద్రాబాదులో ప్రచారం చేయాలని పవన్ ను కోరామని తెలిపారు. అయితే, మోడీ సభ తర్వాత ప్రచారంపై స్పష్టత ఇస్తానని చెప్పినట్టు దత్తాత్రేయ చెప్పారు. కాగా, ఈ నెల 22న నిజాం కళాశాలలో మోడీ సభ ఉంది. దీనికి పవన్ హాజరుకానున్నారు.