: మనుషుల వరకు ఇంకా రాని అద్భుత పరిశోధన
జీవకోటి ఆరోగ్యం కాపాడే పరంగా ఓ అద్భుతమైన వైద్య పరిశోధన హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల చేతిలో ఆవిష్కృతమైంది. అయితే దీనిని ఇంకా మనుషులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రాణుల రక్తంలో రోగకారక క్రిములు చేరితే.. వాటిని శుద్ధి చేసే ప్రక్రియ చాలా కీలకమైనది. అందుకోసం ఒక కృత్రిమ ప్లీహం (స్ప్లీన్ ఆన్ ఏ చిప్)ను వైద్యులు రూపొందించారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఈ రక్తంలో ఇన్ఫెక్షన్లు మరణాన్ని కూడా కలిగిస్తాయి. ఈ కృత్రిమ ప్లీహం ఏర్పాటు ఆ ప్రమాదాన్ని తప్పిస్తుంది. దీన్ని మనుషులకు అనుసంధానించడం గురించి ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి.