: టీడీపీలో చేరనున్న శైలజానాథ్?
మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. కాంగ్రెస్ పార్టీలో సమైక్యవాదిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న శైలజానాథ్ పై అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజనలో కనీసం మాటవినని పార్టీలో ఉంటూ, ఎన్నికల్లో పోటీ చేయడమేంటని నిలదీస్తున్నట్టు సమాచారం. దీంతో పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన పార్టీ మారాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ మారితే టీడీపీలో చేరి సింగనమల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.