: విద్యార్థినిపై దాడి చేసి గొంతు కోసిన ఆగంతుకులు


నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఇంటి నుంచి స్కూలుకు వెళ్తున్న దివ్యపై కొంత మంది ఆగంతుకులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతు కోసి పరారయ్యారు. రక్తపు మడుగులో కుప్ప కూలిన దివ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా దివ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగంతుకుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News