: రాజకీయ పార్టీలతో ముగిసిన కేంద్ర ఎన్నికల సంఘం భేటీ
రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ ముగిసింది. జూబ్లీహాలులో జరిగిన సమావేశానికి హాజరైన పలువురు నేతలు తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను ప్రధానాధికారి వీఎస్ సంపత్ కు తెలిపారు. డబ్బు, మద్యం పంపణీనీ అరికట్టేందుకు తనిఖీలు పెంచాలని ఈసీని కోరారు. అంతేగాక ఆచరణ సాధ్యం కాని ఎన్నికల హామీలు ఇచ్చిన పార్టీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల సిబ్బందితో ఈసీ భేటీ అయింది.