: హన్సికతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు
అందాల భామ, సినీనటి హన్సిక ఊహించని ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఓ సినిమా షూటింగ్ కోసం ఈ కథానాయిక గోవా వెళ్లింది. ఈ సినిమాలో సిద్ధార్థ హీరోగా నటిస్తున్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో గోవా బీచ్ లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో కొంత మంది హన్సిక అభిమానులమని చెప్పి ఆటోగ్రాఫ్ కోసం ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె ఆటోగ్రాఫ్ ఇస్తుండగా, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో షాక్ కు గురైన హన్సిక వారిని తోసేసింది. ఈ విషయాన్ని గమనించిన యూనిట్ సభ్యులు ఆకతాయిలను తరిమికొట్టేందుకు ప్రయత్నించగా... వారు యూనిట్ సభ్యులతో గొడవ పడ్డారు. జరిగిన వ్యవహారంపై యూనిట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.