: రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో కేటీఆర్


టీఆర్ఎస్ నేత కేటీఆర్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు సమాచారం. ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎడమ మూత్ర పిండంలో రాయిని గుర్తించి లితోట్రిప్స్ కీ హోల్ శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

  • Loading...

More Telugu News