: మోడీ నా సాయం కోరారు: గిలానీ


కాశ్మీరీ వేర్పాటు వాద నేత సయ్యద్అలీ షా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మోడీ తన సాయం కోరారని ఆయన వెల్లడించారు. మోడీ తరపున ఇద్దరు కాశ్మీరీ పండిట్లు గత నెల 22న తనను సంప్రదించారని ఆయన తెలిపారు. మోడీ తనతో భేటీ కావాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారని, అందుకు తాను తిరస్కరించినట్లు బయటపెట్టారు. అయితే, గిలానీ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇవి ఆధార రహితమని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, దీనిపై ఎలాంటి చర్చలకు తావులేదని ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News