: నరసరావుపేటలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ!
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సయ్యద్ జిలానీ విముఖత వ్యక్తం చేశారు. తొలుత ఈ సీటుకు కాసు మహేష్ పేరును ప్రకటించగా, ఆయన తిరస్కరించడంతో జిలానీకి కేటాయించారు. ఇప్పుడు ఆయన కూడా వద్దనడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే పలు చోట్ల పార్టీ అభ్యర్థులు పోటీ చేయనని చెబుతున్న సంగతి తెలిసిందే.