: నోబెల్ గ్రహీత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్(87) కన్నుమూత
నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్(87) కన్నుమూశారు. సాహితి ప్రపంచం 'గాబొ' అని ప్రేమగా పిలుచుకునే ఈ ప్రఖ్యాత స్పానిష్ రచయిత కొలంబియాలో పుట్టి పెరిగారు. ఆయన రాసిన 'వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్' అనే నవలకు నోబెల్ బహుమతి లభించింది. ఈ నవల 25 భాషల్లోకి అనువాదమైంది. అంతేకాకుండా, 50 మిలియన్ ప్రతులకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. స్పానిష్ చరిత్రలో సెర్వాంటిన్ 'డాన్ క్విక్జోట్' తర్వాత అంత గొప్ప నవల ఇదేనని విమర్శకులు సైతం ప్రశంసించారు.