: ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఆనందం : రికీ పాంటింగ్
మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ లలో ఆడటం ఆనందాన్నిస్తోందని ప్రముఖ క్రికెటర్, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. ఈ సీజన్ లో రికీ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించబోతోన్న సంగతి విదితమే. 2008 ఐపీఎల్ ఆవిర్భావ వేళ పాంటింగ్ ఈ టోర్నీలో పాల్గొని, అనంతరం బిజీ షెడ్యూల్ కారణంగా దూరంగా ఉన్నాడు. ఐదేళ్ల అనంతరం ఐపీఎల్ లో రికీ మళ్లీ సందడి చేయనున్నాడు.