: వరుస సెలవులతో తిరుమలలో పెరిగిన రద్దీ
వరుస సెలవులతో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.