: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల బీభత్సం
ఈ వేసవిలోనే ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సాయంకాలానికి మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చిత్రం మారిపోయింది. మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. దౌల్తాబాద్ మండలం సాంగాయిపల్లి గ్రామంలో వీచిన ఈదురుగాలులతో స్థంభం విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కర్నూలు-ఆత్మకూరు రహదారిపై గాలి బీభత్సానికి చెట్లు విరిగి పడ్డాయి. జూపాడు బంగ్లా వద్ద వడగండ్ల వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు.