: సుప్రియాసూలేకు ఓటేయకపోతే నీరు నిలిపేస్తామన్నారు: ఆప్ ఫిర్యాదు
సుప్రియా సూలేకు ఓటు వేయకపోతే మంచినీటి సరఫరా నిలిపేస్తామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లను బెదిరించారని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్తి సురేష్ కోప్టే వడ్గావ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నియోజక వర్గ పరిధిలోని మసాలావాడి గ్రామంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సాక్ష్యంగా తన వద్ద వీడియో ఉందని ఆయన వెల్లడించారు. వీడియో పూర్తిగా పరిశీలించిన తరువాతే కేసు నమోదు చేయాలో వద్దో నిర్ణయిస్తామని ఇన్స్పెక్టర్ విలాస్ భోంస్లే తెలిపారు.