: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీడీపీ విజయం సాధిస్తుంది: సుజనాచౌదరి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. హైదరాబాదులోని చంద్రబాబు నాయుడు నివాసంలో బీజేపీ నేతలతో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సుస్థిర పాలన అందించే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. తమ రెండు పార్టీల మధ్య సమస్యలు లేవని, రెండు పార్టీల అభిప్రాయాలను మాత్రం పంచుకున్నామని ఆయన అన్నారు. బీజేపీకి 13 అసెంబ్లీ, 4 లోక్ సభ, 3 ఎమ్మెల్సీ స్థానాల్లో సర్దుబాట్లు సూచించామని ఆయన వెల్లడించారు.