: కేజ్రీవాల్ కు భద్రత పెంపు
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్తి నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు అడుగడుగునా నిరసనలు, వ్యతిరేకత, దాడులు ఎదురవుతున్నాయి. దీంతో వారణాసి పోలీసులు కేజ్రీవాల్ కు భద్రత పెంచాలని నిర్ణయించారు. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. భద్రతకు వ్యతిరేకుడైన కేజ్రీవాల్ దీనిపై స్పందించాల్సి ఉంది.