: ఓటేయమంటున్న 'లేడి'పిల్ల
కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నోడో కవి... దానిని స్పూర్తిగా తీసుకున్న ఎన్నికల సంఘం ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు కాదేదీ అనర్హం అంటూ సినీ నటులు, హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలను ప్రచారకులుగా నియమించుకున్న ఎన్నికల సంఘం, తాజాగా 'మచ్చల లేడి'పిల్లని ప్రచారకర్తగా నియమించింది. బెంగాల్ లోని నదియా జిల్లాలో 67 వేల హెక్టార్ల వీస్తీర్ణంలో 'బేతువాద హరిత అభయారణ్యం' ఉంది. ఇందులో 'మచ్చల లేడి' ఫేమస్.
అందుకే ఎన్నికల సంఘం మచ్చల లేడిని ప్రచారకర్తగా ఉపయోగించింది. ఓటేయాలంటూ 'ధోతీ కట్టిన లేడి' బొమ్మతో పోస్టర్లును ముద్రించిన ఎన్నికల సంఘం స్థానికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో అంతికించింది. మచ్చల లేడికి 'మృగబాబు' అని పేరు పెట్టారు. ఇక్కడ మే 12 పోలింగ్ జరుగనుంది.