: పురంధేశ్వరి సీటుపై తొలగిన సంధిగ్దత... రేపు నామినేషన్
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుల చర్చలు ఫలప్రదం కావడంతో... ఎవరికి ఎన్ని సీట్లు, ఎక్కడ సీట్లు అనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. ఈ క్రమంలో, ఇంతకు ముందు కేటాయించిన విధంగానే బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి రాజంపేట లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆమె నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఆమె సోదరులు జయకృష్ణ, జయశంకర్ కృష్ణతో పాటు పలువురు కుటుంబసభ్యులు హాజరవుతారు.