: ఇచ్చాపురం పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ.. టీడీపీకి బదలాయింపు


సీమాంధ్రలో టీడీపీ కేటాయించిన అసెంబ్లీ సీట్లలో ఒక్క ఇచ్చాపురం తప్ప మిగతా అన్నింటిలో బీజేపీ పోటీ చేస్తుంది. దాంతో, ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బరిలోకి దిగనున్నారు. దీనికి బదులుగా బీజేపీకి తెలుగుదేశం ఎమ్మెల్సీ సీటు ఇవ్వనుంది. ఈ మేరకు హైదరాబాదులోని వెంకయ్యనాయుడు నివాసంలో జరిగిన సమావేశంలో ప్రకాష్ జవదేకర్, కె.హరిబాబు, సుజనా చౌదరి, కె.రామ్మోహన్ చర్చించారు. దాంతో, సీమాంధ్రలో నాలుగు లోక్ సభ, 13 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. రెండు రోజుల నుంచి పొత్తు ఉంటుందా? లేదా? అని నీలినీడలు కమ్ముకోవడంతో తెగదెంపులేనని అంతా అనుకున్నారు. అయితే, చివరికి ఒక్క సీటు విషయంలో సర్దుకుపోయి వివాదానికి తెరదించడం గమనార్హం.

  • Loading...

More Telugu News