: కుమారుడిని పరామర్శించిన కేసీఆర్
నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహస్తూ తీవ్రమైన కడుపునొప్పితో అస్వస్థతకు గురైన కేటీఆర్ ను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఆయన తండ్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు పరామర్శించారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే.