: కాంగ్రెస్ తరపున రాష్ట్రంలో జయప్రద ఎన్నికల ప్రచారం


రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఎన్నికల ప్రచారంలో సినీగ్లామర్ ను దింపేందుకు సిద్ధమవుతోంది హస్తం. ఈ క్రమంలో ఉత్తరాదిన రాజకీయ నాయకురాలిగా పేరొందిన ఏపీకి చెందిన సినీనటి జయప్రద చేత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయించనున్నారు. ఈ మేరకు ఆమె తెలంగాణలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఆర్ఎల్డీ తరపున బిజ్నోర్ నుంచి జయ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News