: ఓటేయకపోతే నీటి సరఫరా బంద్ అన్న అజిత్ పవార్!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు వరుసకు అల్లుడైన అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న అజిత్... మసల్ వాడీ అనే గ్రామంలోని ప్రజలతో సమావేశమయ్యారు. తమ మామ కుమార్తె సుప్రియకు ఓటు వేయకపోతే ఊరికి నీటి సరఫరా నిలిపివేస్తామని బెదిరించారు. ఎవరు ఏపార్టీకి ఓటేశారో కూడా తమకు తెలిసిపోతుందన్నారు. ఈ మాటలను ఎవరో రహస్యంగా సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసి బయటపెట్టారు. దాంతో, శివసేన, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.