: కిలోమీటరు ఎత్తయిన భవనం
నిర్మాణంలో సౌదీ అరేబియా ప్రపంచ రికార్డును నమోదు చేయబోతోంది. ఏకంగా కిలోమీటరు ఎత్తయిన టవర్ ను నిర్మించనుంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న 2,716 అడుగుల ఎత్తయిన బుర్జ్ ఖలీఫా టవరే ప్రపంచంలో ఎత్తయిన భవనంగా గిన్నిస్ రికార్డుల్లో ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వం జెడ్డాలో 3,280 అడుగుల ఎత్తయిన టవర్ నిర్మాణానికి ప్రణాళికలు రచించింది. వచ్చే వారం దీని నిర్మాణం ప్రారంభం కానుంది. నిర్మాణ వ్యయం అంచనా 123కోట్ల డాలర్లు(7,400కోట్ల రూపాయలు). ఈ భవనంలో 200 అంతస్తులుంటాయి. సాగరం పక్కనే నిర్మిస్తున్నందున 200 అడుగుల లోతు నుంచి ఫౌండేషన్ వేయనున్నారు.