: కేంద్రమంత్రి స్మగ్లింగ్ చేస్తారు.. మత్తుపదార్థాలు తీసుకుంటారు : ఎస్పీ
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ - సమాజ్ వాది పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్రవాది అంటూ గతంలో బేణీ విమర్శించారు. అనంతరం చింతిస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ నిన్న రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ నుంచి 4గురు మాత్రమే గెలుస్తారని, ఆ నలుగురే ఆ పార్టీకి పాడె కడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత చేస్తే సమాజ్ వాది పార్టీనేతలు ఊరకఉండరు కదా.. ఇవాళ వీళ్లు రెచ్చిపోయారు.. వీళ్ల వెర్షన్ ఏంటంటే..
కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ ఓపియం (నల్లమందు) స్మగ్లింగ్ చేస్తారని.. చరస్ లాంటి మత్తుపదార్థాలు సేవిస్తారంటూ సమాజ్ వాది పార్టీ నేత శివపాల్ యాదవ్ తీవ్ర విమర్శలకు దిగారు. అంతేకాదు, బేణీ పొగాకులో నిషేధిత మత్తు పదార్థాలు కలుపుకుని తాగుతారని ఆరోపించారు.