: యువరాజ్ పై విమర్శలు తగదు: కోహ్లీ
టీ20 ప్రపంచకప్ లో చెత్త ఆటతో భారత్ ఓడిపోవడానికి కారణమై విమర్శల పాలైన యువరాజ్ సింగ్ ను స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ వెనకేసుకొచ్చాడు. యువరాజ్ పై ఇటీవల వచ్చిన విమర్శలు సరికావని చెప్పాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో ప్రపంచకప్ గెలుచుకోవడంలో యువరాజ్ ముఖ్యపాత్ర పోషించాడని తెలిపారు. తానేంటో నిరూపించుకున్న యువరాజ్ వెంట నిలవాల్సిన అవసరం ఉందన్నాడు.