: కాంగ్రెస్ లో చేరిన నటుడు జీవి.. గాజువాక టికెట్ ఇస్తామని చిరు హామీ
తెలుగు నటుడు జీవీ కాంగ్రెస్ లో చేరారు. నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ, జీవీకి గాజువాక అసెంబ్లీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు టీడీపీలో చేరాలనుకున్న జీవీ చంద్రబాబుతో చర్చలు జరిపినప్పటికీ ఫలితంలేకపోవడంతో హస్తం గూటికి చేరారు.