: సీమాంధ్రలో కటీఫ్ చెప్పినా... తెలంగాణలో కలిసే ఉంటాం: కిషన్ రెడ్డి
టీడీపీతో బీజేపీ పొత్తు వ్యవహారం పలు మలుపులు తిరుగుతుండడంతో పొత్తులపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నా, తెలంగాణలో కలిసే ఉంటామని అన్నారు. తెలంగాణలో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.