: మంగళగిరి టీడీపీలో కార్యకర్తల రగడ
గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీలో రగడ మొదలైంది. పారిశ్రామికవేత్త తులసీ రామచంద్రప్రభుకు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సీటును తులసి రామచంద్రప్రభుకు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో స్థానికేతరుడికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు ఇవాళ తాళం వేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.