: ఉత్తర్ ప్రదేశ్ లో అమిత్ షా ప్రచారానికి ఈసీ అనుమతి
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ నేత, నరేంద్రమోడీ అనుచరుడు అమిత్ షాకు ఎన్నికల సంఘం అనుమతి తెలిపింది. ఇకనుంచి ఎలాంటి అమర్యాదకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని ఈసీకి షా తెలపడంతో ఆయనపై విధించిన బ్యాన్ ఎత్తివేసి ప్రచారానికి అంగీకరించింది. ముజఫర్ నగర్ లో కొన్ని రోజుల కిందట ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా షా ప్రచారం చేశారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నేత అజమ్ ఖాన్ పై విధించిన బ్యాన్ పై స్టే విధించింది.