: హైదరాబాదు పాతబస్తీలో అగ్నిప్రమాదం
హైదరాబాదు పాతనగరంలోని మదీనాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా దుకాణాల్లోని వస్త్రాలు, పాదరక్షలు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.